స్మిత్ రెండో వివాహం

Mana Telangana

Mana Telangana

Author 2019-11-06 02:54:30

img

జోహెన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్ మరోసారి ఇంటి వాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు రోమీను స్మిత్ పెళ్లాడాడు. స్మిత్‌కు ఇప్పటికే ఓసారి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చాలా ఏళ్ల క్రితమే స్మిత్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఇక, తన చిన్ననాటి ప్రియురాలు రోమీతో రెండో వివాహం చేసుకున్నాడు. కిందటి ఏడాది ఇద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయిత చాలా రోజుల తర్వాత ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా స్మిత్ అభిమానులతో పంచుకున్నాడు.

మరోవైపు కొత్త దంపతులు స్మిత్‌రోమీలను పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు అభినందించారు. ఇదిలావుండగా ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా స్మిత్ పేరు తెచ్చుకున్నాడు. అంతేగాక అతి చిన్న వయసులోనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక, ప్రపంచ క్రికెట్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా స్మిత్ తనదైన ముద్ర వేశాడు. ఎన్నో చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆడిన ఘనత స్మిత్‌కు ఉంది. అంతేగాక దక్షిణాఫ్రికా విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్మిత్ ప్రస్తుతం కామంటేటర్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

Graeme Smith marries wife Romy Lanfranchi for 2nd time

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN