హర్బజన్‌కు అనుమతి నిరాకరణ!

Nava Telangana

Nava Telangana

Author 2019-10-05 02:52:17

- ఇంగ్లాండ్‌ 100 బంతుల లీగ్‌
న్యూఢిల్లీ : ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మానసపుత్రిక 100 బంతుల లీగ్‌లో ఆడేందుకు హర్బజన్‌ సింగ్‌కు బీసీసీఐ అనుమతి నిరాకరించినట్టు సమాచారం!. హర్బజన్‌ సింగ్‌ (37) అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంకా వీడ్కోలు పలుకలేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌, ఐపీఎల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలకనిదే విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు భారత క్రికెట్‌ బోర్డు అనుమతి మంజూరు చేయటం లేదు. ఈ నేపథ్యంలోనే హర్బజన్‌ సింగ్‌కు సైతం అనుమతి ఇవ్వలేదని సమాచారం. ' బీసీసీఐ నుంచి హర్బజన్‌ సింగ్‌ నిరభ్యంతర పతం (ఎన్‌ఓసీ) అడుగలేదు. అనుమతి లేకుండా ఏ లీగ్‌లోనైనా పేరు నమోదు చేసుకునేందుకు వీల్లేదు. బీసీసీఐ పాలసీకి ఇది వ్యతిరేకం. ఈ విషయంలో భజ్జీని బోర్డు సంప్రదించింది. 100 లీగ్‌ ఆటగాళ్ల ముసాయిదాలో నేను లేనని హర్బజన్‌ వివరణ ఇచ్చాడు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD