హర్భజన్ సింగ్ ట్వీట్‌కి యువరాజ్ ఫన్నీ రిప్లే

Nava Telangana

Nava Telangana

Author 2019-10-01 00:07:00

ముంబై: టీం ఇండియా జట్టులో నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయాలనే అంశంపై ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. ఐసీసీ ప్రపంచకప్‌కి ముందే ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ, ప్రపంచకప్ ముగిసిన తర్వాత కూడా ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ విషయంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. విజయ్ హజారే ట్రోఫీలో యువ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గొప్పగా రాణిస్తున్నాడు. అయితే అతన్ని టీం ఇండియాలో నాలుగో స్థానంలో ఎందుకు తీసుకోవడం లేదు అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. 'దేశవాళీ క్రికెట్‌లో ఇన్ని పరుగులు చేస్తున్నా.. సూర్యకుమార్‌ని జట్టులోకి ఎందుకు తీసుకోవడంలేదో నాకు అర్థం కావడం లేదు. సూర్యకుమార్ కష్టపడు.. నీకు టైం వస్తుంది' అంటూ హర్భజన్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై యువరాజ్ స్పందించాడు. 'యార్ నీకు ముందే చెప్పాను! వాళ్లకి నెం.4 అవసరం లేదు.. టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది' అని యువరాజ్ రిప్లే పెట్టాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN