హార్దిక్‌ కూడా ఇంగ్లండ్‌కు..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-02 04:48:59

న్యూఢిల్లీ: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి వెన్నునొప్పి తిరగబెట్టడంతో తగిన సలహా తీసుకునేందుకు ఇంగ్లం డ్‌ బయలుదేరనున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌ నుంచి తప్పుకోనున్నాడు. గతేడాది సెప్టెంబరులో పాండ్యా తొలిసారి వెన్నునొప్పికి గురయ్యాడు. అతడికి సర్జరీ తప్పకపోవచ్చని, అదే జరిగితే కోలుకోవడానికి మరో ఐదు నెలలు పట్టవచ్చని సమాచారం. టెస్టు జట్టులో లేని హార్దిక్‌ అటు హజారే ట్రోఫీలోనూ ఆడడం లేదు. ఇదిలా ఉండగా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో శాశ్వత బ్యాటింగ్‌ కోచ్‌గా హృషికేశ్‌ కనిట్కర్‌, బౌలింగ్‌ కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ నియమితులయ్యారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN