హార్దిక్ పాండ్యాకు గాయం

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-02 07:33:00

-బంగ్లా సిరీస్‌కు దూరం!
img
న్యూఢిల్లీ : గాయం వల్ల దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన స్టార్ బౌలర్ బుమ్రా ఎప్పుడు కోలుకుంటాడో స్పష్టత లేని తరుణంలో.. టీమ్‌ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం వెన్నుగాయం కారణంగా జట్టుకు ఎక్కువ కాలం దూరమయ్యే అవకాశం కనిపిస్తున్నది. బంగ్లాదేశ్‌తో నవంబర్‌లో జరిగే టీ20 సిరీస్‌కు అతడు దూరం కానున్నాడు. చికిత్స కోసం హార్దిక్ కూడా బ్రిటన్‌కు వెళతాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. పాండ్యా బ్రిటన్ వెళ్లనున్నాడు. గతేడాది ఆసియా కప్ తర్వాత వెన్ను సమస్య వచ్చాక చికిత్స చేయించుకున్న వైద్యుడినే సంప్రదించనున్నాడు. బంగ్లాతో సిరీస్‌లో పాండ్యా ఆడడు. ఎంతకాలం జట్టుకు దూరమవుతాడో కచ్చితంగా చెప్పలేం. బ్రిటన్ నుంచి తిరిగి వచ్చాకే ఓ స్పష్టత వస్తుంది అని అధికారి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నీలో సైతం బరోడా తరుఫున హార్దిక్ ఆడడం లేదు. ఒకవేళ శస్త్రచికిత్స అవసరమైతే ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరమవ్వాల్సి ఉంటుంది. అదే జరిగేతే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కూడా అతడు ఆడేది అనుమానంగానే మారుతుంది. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం హార్దిక్ ఉండడం టీమ్‌ఇండియాకు చాలా కీలకం. సెలెక్టర్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా చికిత్స కోసం త్వరలో బ్రిటన్ వెళ్లనున్న సంగతి తెలిసిందే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN