హిట్ మ్యాన్‌ను ఆపతరమా?

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-09 03:25:07

img

పూణె : భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి పూణె వేదికగా రెండో టెస్టు మొదలు కానుంది. మొదటి టెస్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రెండు సెంచరీలకు తోడు మాయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండో టెస్టులోనూ విజయం సాధించి , మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవ సం చేసుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. మరోవైపు మొదటి టెస్టు ఘోర ఓటమికి బదులు తీర్చుకోవాలనే కసితో బరిలోకి దిగి, సిరీస్‌ను సమం చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.
రోహిత్‌ను ఆపతరమా?
చాలా రోజుల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, ఈ సిరీస్‌లో ఓపెనర్ గానూ ఆరంగేట్రం చేశాడు. మొదటి టెస్టుకు ముందు ఒత్తిడి లోనూ రెండు సెంచరీలు సాధించి, తానేంటో నిరూపించుకు న్నాడు. అయతే రెండో టెస్టులోనూ అభిమానులు హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌పై గంపెడంతా ఆశలు పెట్టుకున్నారు. ఏదేలాఉన్నా ఈ సిరీస్‌లో రాణించి టెస్టుల్లో పాతుకుపోయే విధంగా రోహిత్ ప్ర ణాళికలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యువ ఆటగాడు మా యాంక్ అగర్వాల్ సైతం డబుల్ సెంచరీతో రాణించిన తీరు అందరి నీ ఆకట్టుకుంది. అయతే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తడబడ్డా, జట్టు గెలుపులో మాత్రం కీలకపాత్ర పోషించాడనే చెప్పాలి. ఇక మొదటి ఇన్నింగ్ సలో తడబడి, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం చేసిన చటేశ్వర్ పుజారా ఫాంలోకి రావడం జట్టుకి అదనపు బలం. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఆల్‌రౌండర్ హనుమ విహారి చెలరేగితే భారత్‌ను అడ్డుకోవడం ప్రోటీస్‌కు కష్టమే.
సూపర్ బౌలింగ్..
ఇక బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు పేసర్ మహ్మద్ షమీ మొదటి టెస్టులో పోటీపడి మరీ వికెట్లు తీశారు. చాలారోజుల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసి తనలో ఇంకా వేడి తగ్గలేదని నిరూపించుకున్నాడు. అంతే కాకుండా అతి తక్కువ (66) ఇన్నింగ్‌ల్లో 350 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సాధించాడు. అశ్విన్‌కు ముందు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్ ఉన్నారు. ఇక రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ జట్టు అవసరాల మేరకు రాణించడం శుభపరిణామమే.
ఒకరిద్దరు మాత్రమే..
ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజీ నుంచే అవమానకరంగా ఇంటి బాట పట్టిన దక్షిణాఫ్రికా జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయ. అయతే జట్టు కలిసికట్టుగా ఆడడంలో విఫలం కావడమే ఆ జట్టు ప్రధాన సమస్య. మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డీన్ ఎల్గర్, క్వింటన్ డికాక్ మాత్రమే సెంచరీలు చేయగా, కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ మాత్రమే అర్ధ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. అయతే రెండో ఇన్నింగ్‌లో మాత్రం లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ డేన్ పిడ్త్ మాత్రమే అర్ధ సెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా ఆ మాత్రం స్కోరైనా చేయ గలిగింది. అయతే జట్టులో కొత్త ఆటగాళ్లు చేరడం, సీనియా ర్లపైనే భారం పడడంతో సఫారీలు కష్టకాలమే ఎదుర్కొంటు న్నారని చెప్పాలి. ఇక బౌలింగ్ విభాగంలో రబద వంటి పేసర్లు న్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
*చిత్రాలు.. రోహిత్ శర్మ, మాయాంక్ అగర్వాల్
*రవిచంద్రన్ అశ్విన్

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD