హిట్ మ్యాన్ డబుల్ సెంచరీ మిస్..

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-03 14:35:18

img

విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ... తొలిసారి ఓపెనర్‌గా వచ్చి సెంచరీ బాదేసి రికార్డు సృష్టించిన హిట్‌మ్యాన్ డబుల్ సెంచరీ మాత్రం అందుకోలేకపోయాడు.. తొలి రోజు సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ.. రెండో రోజూ కూడా దూకుడు చూపించాడు. వర్షం కారణంగా 202 స్కోర్ దగ్గర మ్యాచ్ నిలిచిపోగా.. 115 పరుగులతో రోహిత్, 84 పరుగులతో మయాంక్ అగర్వాల్ క్రీజీలు ఉన్నారు. అయితే, ఇవాళ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి దూకుడుగానే ఆడారు.. ఈ క్రమంలో 300 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక, 82 ఓవర్‌లో చివరి బంతికి ఔట్ అయ్యాడు రోహిత్.. జట్టు స్కోర్ 317 పరుగుల దగ్గర.. 176 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మహరాజ్ బౌలింగ్‌లో డి కాక్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో రోహిత్ డబుల్ సెంచరీ మిస్ అయిపోయింది. టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్‌.. తొలి మ్యాచ్‌తోనే దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డును సమంచేశాడు. స్వదేశంలో రోహిత్‌ ఆడిన 15 ఇన్నింగ్స్‌లలో 98.22 సగటుతో 884 పరుగులు చేశాడు. బ్రాడ్‌మన్‌ తన స్వదేశంలో ఆడిన 50 ఇన్నింగ్స్‌లలో 98.22 సగటుతో 4,322 పరుగులు చేశారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN