హిట్ మ్యాన్ మళ్లీ హిట్..! రోహిత్‌ ఖాతాలో మరో రికార్డు

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-02 17:25:48

img

వైజాగ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరగుతోన్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు.. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఫస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌. కెరీర్‌లో రోహిత్‌కిది నాలుగో సెంచరీ కాగా... రోహిత్ సెంచరీతో భారీ స్కోరు దిశగా టీమిండియా దూసుకెళ్తోంది. మరో ఓపెనర్‌ మయాంక్‌ కూడా హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఇక, వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడగా... ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా 202 పరుగులు చేయగా... 174 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్ శర్మ 115 పరుగులతో క్రీజ్‌లో ఉండగా... 183 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 84 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్.

ఇక, ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఫస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాటిన బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.. 2013లో ఆసీత్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగి శిఖర్‌ధావన్ 187 పరుగులతో ఆకట్టుకోగా.. 2015లో వెస్టిండీస్‌పై కేఎల్ రాహుల్ 110 పరుగులు చేశారు.. ఇక 2018లో రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సాహా 134 చేశాడు.. ఇప్పుడు సౌతాఫ్రికాతో విశాఖ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్‌లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు రోహిత్.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN