హీరోయిన్ తో క్రికెటర్ పెళ్లి

Telugu Mirchi

Telugu Mirchi

Author 2019-10-11 14:46:00

img

టీమిండియా ఆటగాడు మనీశ్‌ పాండే త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. సినీ నటి అశ్రిత షెట్టిని అతను వివాహం చేసుకోనున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌ 2న వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు సమాచారం.

ముంబైకి చెందిన అశ్రి 2012లో తుళు భాషలో నిర్మితమైన ‘తెళికెద బొల్లి’ద్వారా తెరంగేట్రం చేసింది. అనంతరం ఉదయం ఎన్‌హెచ్‌ 4 ద్వారా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. తమిళంలోనే ‘ఒరు కన్నియమ్‌ మూను కలవానికుళుమ్‌’, ‘ఇంద్రజిత్‌’ సినిమాల్లోనూ నటించింది.

ప్రస్తుతం మనీశ్ పాండే విజయ్ హజారే టోర్నీలో కర్ణాటక జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్-12 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిథ్యం వహించిన మనీశ్ పాండే జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN