హీలీ పపంచ రికార్డు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-03 05:44:45

img

  • మహిళల టీ20లో అత్యధిక స్కోరు చేసిన ఆసీస్‌ క్రికెటర్‌

సిడ్నీ: మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా ఆస్ట్రేలి యాకు చెందిన అలిస్సా హీలీ ప్రపంచ రికార్డు సృష్టించింది. మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో హీలీ (61 బంతుల్లో 148 నాటౌట్‌) మహిళల టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసింది. 46 బంతుల్లోనే హీలీ సెంచరీ మార్క్‌ చేరుకోవడం విశేషం. తొలుత ఆస్ట్రేలియా.. హీలీ విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 226/2 స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 94 పరుగులే చేసింది. ఫలితంగా 132 పరుగుల తేడాతో ఓడింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN