హుస్సాముద్దీన్‌ పసిడి పంచ్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-11 06:53:15

img

  • జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. నాలుగు రోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న ఈ పోటీలు గురువారం ముగిశాయి. హుస్సాముద్దీన్‌తో పాటు శివ థాపా (63 కి.), అంకిత్‌ (75 కి.), సుమిత్‌ (91 కి.), పీఎల్‌ ప్రసాద్‌ (52 కి.) పసిడి పతకాలు సాధించారు. సర్వీసె్‌సకు ప్రాతినిథ్యం వహిస్తున్న హుస్సాముద్దీన్‌ 57 కి. విభాగం ఫైనల్లో రైల్వేస్‌ బాక్సర్‌, యూత్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ సచిన్‌ శివాచ్‌తో తలపడ్డాడు. తనకంటే పొడగరైన సచిన్‌ను తొలి రెండు రౌండ్లలో ఎదుర్కోవడానికి అతడు కొంత ఇబ్బంది పడ్డాడు. మూడో రౌండ్లో గేర్‌ మార్చిన హుస్సాముద్దీన్‌ ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించి 3-2తో గెలుపొందాడు. సర్వీసెస్‌ టీమ్‌.. చాంపియన్‌షి్‌పను దక్కించుకోగా రైల్వేస్‌ రన్నర్‌పగా నిలిచింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN