హైదరాబాద్‌ ఎఫ్‌సీ జెర్సీ ఆవిష్కరణ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-30 06:26:46

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)-6లో అరంగేట్రం చేస్తున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు జెర్సీని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌, సినీనటుడు వెంకటేష్‌ ఆదివారం ఆవిష్కరించారు. అజరుద్దీన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌కు ఘనమైన ఫుట్‌బాల్‌ వారసత్వం ఉందని చెప్పాడు. ‘దానిని పునరుద్ధరించడానికి గతంలో ఫుట్‌బాల్‌ సంఘంతో కలిసి నేను ప్రయత్నించా. కానీ, సాధ్యపడలేదు. అయితే, హైదరాబాద్‌ ఎఫ్‌సీని చూస్తుంటే రాష్ట్రంలో మళ్లీ ఫుట్‌బాల్‌కు మంచిరోజులు వచ్చినట్టే అనిపిస్తోంది’ అని అజర్‌ అన్నాడు. ఈ కార్యక్రమంలో జట్టు సహ యజమానులు త్రిపురనేని వరుణ్‌, విజయ్‌ మద్దూరి, కోచ్‌ ఫిల్‌ బ్రౌన్‌, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ పాల్గొన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN