హైదరాబాద్ ఎఫ్‌సీ జెర్సీ ఆవిష్కరణ

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-30 05:51:00

img
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) నూతన ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నగరంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, సినీ నటుడు వెంకటేశ్ హాజరై జెర్సీని విడుదల చేశారు. హైదరాబాద్ సంస్కృతి, ప్రముఖ కట్టడాలు, నగర వారసత్వాన్ని ప్రతిబింబించేలా షేర్వానీ లుక్‌లో పసుపు, నలుపు రంగులతో జెర్సీ ఆకట్టుకునేలా ఉంది. కోచ్ ఫిల్ బ్రౌన్ దిశానిర్దేశంలో ఐఎస్‌ఎల్ టోర్నీలో హైదరాబాద్ జట్టు మంచి ప్రదర్శన చేస్తుందని అజారుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాభిమానిగా హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ క్లబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని హీరో వెంకటేశ్ అన్నారు. 1956 ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత ఫుట్‌బాల్ జట్టులో 8మంది ప్లేయర్లు హైదరాబాద్ వారేనని, అప్పుడు మన జట్టు నాలుగో స్థానం నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఎఫ్‌సీ కోచ్ ఫిల్ బ్రౌన్, ఫ్రాంచైజీ సహ యజమానులు వరుణ్ త్రిపురనేని, విజయ్ మద్దూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లను పరిచయం చేశారు. అక్టోబర్ 20న ఐఎస్‌ఎల్ ఆరో సీజన్ మొదలు కానుండగా, 25న కోల్‌కతా (ఏటీకే)తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN