హోరాహోరీగా జాతీయస్థాయి అథ్లెటిక్‌ పోటీలు

Prajasakti

Prajasakti

Author 2019-11-06 05:30:38

img

ప్రజాశక్తి - ఎఎన్‌యు (గుంటూరు జిల్లా):
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి జూనియర్‌ అథ్లెటిక్‌ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవారం పలు విభాగాల్లో గత రికార్డులను అథ్లెట్లు తిరగరాస్తూ నూతన రికార్డులు నమోదు చేస్తున్నారు. అండర్‌-20 మహిళల విభాగం 800 మీటర్ల పరుగులో హర్యానా అథ్లెట్‌ రచన 2:06:12 సెకన్లతో గతంలో టింటు లూకా (2:07:48) రికార్డును బద్దలు కొట్టడంతోపాటు మీట్‌ రికార్డును నమోదు చేసింది. బాలుర విభాగం అండర్‌-16 విభాగం 800 మీటర్ల పరుగులో హర్యానా అథ్లెట్‌ పర్వేజ్‌ఖాన్‌ 1:54:78 సెకన్లలో, మధ్యప్రదేశ్‌ అథ్లెట్‌ శ్యామ్‌ మిలన్‌బింద్‌ 1:55:33 సెకన్లలో పూర్తి చేసి గతంలో బిరేన్‌ గోగోరు (1:55:70) రికార్డును అధిగమించారు. బాలికల అండర్‌-16 విభాగంలో 3వేల మీటర్ల రేస్‌వాక్‌లో ఉత్తరా ఖండ్‌ అథ్లెట్‌ రేష్మాపటేల్‌ 14:14:83 సెకన్లలో అధిగ మించి గతంలో కుమారి ముజఫర్‌ రికార్డును అధిగమించ డంతోపాటు మీట్‌ రికార్డును నమోదు చేసింది. మొత్తంగా ఇప్పటి వరకూ టోర్నీ టాప్‌ స్కోరర్‌గా 327.5 పాయింట్లతో హర్యానా మొదటి స్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కేరళ ఉన్నాయి. తెలంగాణ 10వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్‌ 16వ స్థానంలోను ఉన్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD