హ్యాపీ బర్త్‌డే కోహ్లీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-05 05:05:10

img

  • 31వ వసంతంలోకి విరాట్‌

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మంగళవారం 31వ ఏట ప్రవేశించాడు. క్రీడాకారులు.. ముఖ్యంగా క్రికెటర్లు జన్మదినం, ఇతర పండుగ రోజుల్లో కుటుంబం చెంత ఉండడం చాలా అరుదు. ఒకవేళ స్వదేశంలో ఉన్నా..ఏదో అంతర్జాతీయ సిరీ్‌సలో ఆడుతుంటారు. యాదృచ్ఛికమేమోకానీ విరాట్‌ ఈ బర్త్‌డే రోజు కుటుంబంతో ఉన్నాడు. సుదీర్ఘ క్రికెట్‌ ఆడుతున్న అతడికి ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీ్‌సకు విశ్రాంతి నిచ్చిన సంగతి తెలిసిందే. మరో యాదృచ్ఛికమేమిటంటే..గత ఏడాది జన్మదినాన కూడా కోహ్లీ రెస్ట్‌లోనే ఉన్నాడు. అప్పట్లో భారత్‌లో వెస్టిండీస్‌ టూర్‌ జరుగుతోంది. నాడుకూడా టీ20లలోనే టీమిండియా తలపడడం గమనార్హం.

గత సంవత్సరం జన్మదినాన విరుష్క జోడీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్‌లో గడపడం విశేషం. ఈసారి వాళ్లు భూటాన్‌ వెళ్లారు. ఇక..నిరుడు విరాట్‌ బర్త్‌డే సందర్భంగా..‘కోహ్లీని పుట్టించినందుకు దేవునికి ధన్యవాదాలు’ అని అనుష్క చేసిన ట్వీట్‌ విరాట్‌ అభిమానుల హృదయాలను కదిలించింది. ఇకపోతే..ఈసారి కోహ్లీ పుట్టినరోజున స్టార్‌స్పోర్ట్స్‌ సూపర్‌ ‘వి’ పేరిట రూపొందించిన సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌ను మంగళవారం (మధ్యాహ్నం 3.30) ప్రసారం చేస్తోంది. 15 ఏళ్ల వయస్సులో పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటినుంచి టీమిండియా కెప్టెన్‌ అయ్యే క్రమంలో కోహ్లీ ఎదుర్కొన్న కష్ట నష్టాలను, సాధించిన విజయాలను ఈ ఎపిసోడ్లలో వివరించారు. అలాగే చిన్నతనంలో తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులు, టీచర్లతో విరాట్‌ సంబంధాలను కళ్లకు కట్టనున్నారు. మొత్తంగా సూపర్‌ ’వి’ దేశ టీనేజర్లకు స్ఫూర్తినిచ్చేలా రూపొందించారు. మొదటి ఎపిసోడ్‌ మంగళవారం టెలికాస్ట్‌ కానున్నా..మిగిలిన 11 తదుపరి ఆదివారాలు ఉదయం 9 గంటలనుంచి స్టార్‌ప్లస్‌, స్టార్‌ స్పోర్ట్స్‌, డిస్నీ, మార్వెల్‌ హెచ్‌క్యూ, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD