‘ఒక్క చాన్స్‌’ అని సచిన్‌ వేడుకున్న వేళ.!

Amaravatinews

Amaravatinews

Author 2019-09-27 09:07:20

img

Share this on WhatsApp

న్యూఢిల్లీ:తాను ఆడే రోజుల్లో సచిన్‌ టెండూల్కర్‌ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఒక రకంగా క్రికెట్‌లో సచిన్‌ది ఓ శకంగా చెప్పుకోవచ్చు. అలాంటి మాస్టర్‌ ఒకానొక సందర్భంలో ‘ఒక్క చాన్స్‌’ అంటూ వేడుకున్నాడంటే నమ్మగలమా..! కానీ, 1994 న్యూజిలాండ్‌ టూర్‌లో వన్డే మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగడానికి తాను ఎంతో ప్రాధేయపడాల్సి వచ్చిందని స్వయంగా సచినే వెల్లడించాడు. అయితే, అప్పటిదాకా కొనసాగుతున్న సంప్రదాయానికి వ్యతిరేకంగా తాను తీసుకున్న ఆ రిస్క్‌ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని సచిన్‌ చెప్పాడు.

వికెట్లు కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించే సమయంలో.. ఓపెనర్‌గా వచ్చి బౌలర్లపై ఎదురుదాడి చేయాలనే తన సరికొత్త ఆలోచన కెరీర్‌లో ఎదిగేందుకు ఎంతో దోహదం చేసిందన్నాడు. ‘1994లో న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌ వేదికగా వన్డే మ్యాచ్‌. ఎప్పుడూ మిడిలార్డర్‌లో ఆడే నేను ఓపెనర్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఓపెనర్‌గా వెళ్తాను.. ఒక్క అవకాశం ఇవ్వండని మేనేజ్‌మెంట్‌ను బతిమిలాడా. విఫలమైతే మళ్లీ మీ ముందుకు రానని చెప్పా. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా నేను 49 బంతుల్లో 82 రన్స్‌ చేశా. దీంతో మరోసారి అలా అడిగే చాన్స్‌ రాలేద’ని చెప్పాడు. యువ త సాహసాలకు వెనుకాడకూడదని.. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్వాలని చెబుతూ సచిన్‌ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN