‘ధోనీ రిటైర్మెంట్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ కలకలం!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-30 06:19:45

img

న్యూఢిల్లీ: వరల్డ్‌క్‌పలో టీమిండియా సెమీస్‌ ఓటమి తర్వాత ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టలేదు. వెస్టిండీస్‌ టూర్‌, స్వదేశంలో దక్షిణాఫ్రికా పర్యటనకు మహీ దూరమయ్యాడు. దీంతో అతడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ, ధోనీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీ్‌సకు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో మహీ భవిష్యత్‌పై పెద్దఎత్తున చర్చ జరుగుతుండగా.. మంగళవారం మహీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడన్నట్టుగా ‘ధోనీ రిటైర్మెంట్‌’్య హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ కావడం కలకలం రేపింది. అయితే ఇది ఎవరో చేసిన తప్పుడు ప్రచారమని తెలియడంతో మహీ అభిమానులు మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా ‘నెవర్‌ రిటైర్‌ ధోనీ’ అంటూ ఫ్యాన్స్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ చేశారు. ‘ఎవరో కల్పితాలను ప్రచారం చేస్తున్నారు. అతడు టీ20లు తప్పకుండా ఆడతాడ’ని ఒకరు ట్వీట్‌ చేయగా.. ‘కెరీర్‌కు ఎప్పుడు గుడ్‌బై చెప్పాలో మహీకి తెలుసు. అతడు కెరీర్‌ ముగించాలని ఎవరూ కోరుకోవడం లేద’ని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD