‘బీసీసీఐ సమర్థుల చేతుల్లో ఉంది’

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-27 06:02:41

ఇటీవల బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సౌరవ్‌ గంగూలీపై కోచ్‌ రవిశాస్ర్తి తొలిసారిగా స్పందించాడు. అతడి ఎంపిక భారత క్రికెట్‌ సరైన మార్గంలో వెళుతుందనడానికి సూచిక అంటూ కొనియాడాడు. గతంలో భారత జట్టు కోచ్‌ విషయంలో అనిల్‌ కుంబ్లేకు మద్దతుగా నిలిచిన దాదా.. శాస్త్రిని వ్యతిరేకించిన విషయం విదితమే. ‘బోర్డు అధ్యక్ష పదవి చేపట్టిన గంగూలీకి అభినందనలు. క్రికెట్‌ పాలనా వ్యవహారాలు అతడికేమీ కొత్త కాదు. గత నాలుగైదేళ్లుగా ఇదే పనిలో ఉన్నాడు. సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న దాదా హయాంలో భారత క్రికెట్‌ సరైన దిశగా వెళుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం బోర్డు కష్టకాలంలో ఉంది. ఇలాంటి స్థితిలో పగ్గాలు చేపట్టిన గంగూలీ పూర్వ వైభవాన్ని తేగలడు’ అని శాస్త్రి ఆశించాడు. మరోవైపు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) రాహుల్‌ ద్రావిడ్‌ చేతుల్లో ఉండడం కూడా మంచి పరిణామమని అన్నాడు. బీసీసీఐ విభాగాల్లో ఎన్‌సీఏకు చాలా ప్రాధాన్యముందని గుర్తుచేశాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు కీలక స్థానాల్లో ఉంటే భారత క్రికెట్‌కు ఇంతకన్నా కావాల్సిందేముందని సంతృప్తి వ్యక్తం చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD