‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’ జెర్సీ ఆవిష్కరణ

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-17 02:37:05

img

ముంబయలో ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’ జెర్సీ ఆవిష్కరణ గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లెజెండరీ క్రికెటర్లు జాంటీ రోడ్స్ (దక్షిణాఫ్రికా), వీరేంద్ర సెవాగ్ ( భారత్), తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక), సచిన్ టెండూల్కర్ ( భారత్), బ్రియన్ లారా (వెస్టిండీస్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) హాజరయ్యారు. వీరితో పాటు సునీల్ గవాస్కర్ కూడా కార్యక్రమంలో పాల్గొ న్నాడు. ఇదిలాఉంటే ఈ సిరీస్‌తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మూడోసారి మైదానంలో దిగుతున్నాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ ఆ తర్వాత 2014లో
లార్డ్ వేదికగా రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎలెవన్‌లో రెండోసారి ఆడాడు. తాజాగా ఈ సిరీస్‌లో బరిలోకి దిగతుండడంతో సచిన్ ముచ్చటగా
మూడోసారి తిరిగి మైదానంలో అడుగు పెట్టబోతున్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN