‘లైట్ పోయింది’ అంటూ పాక్ బోర్డును ఆటాడుకున్న నెటిజన్లు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-01 23:51:15

img

దాదాపు 10 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టుతో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దు కావడంతో రెండో మ్యాచ్‌ని ఒక రోజు వాయిదా వేసి, సోమవారం నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డును నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ జరుగుతుండగా.. పవర్ కట్ కారణంగా ఆరు ప్లడ్ లైట్లు ఆగిపోయాయి. ఈ ఘటన రెండు సార్లు జరిగింది. దీని వల్ల దాదాపు అరగంట పాటు ఆట నిలిచిపోయింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహణను ట్విట్టర్‌లో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

అందులో కొన్ని ట్వీట్లు:

పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ మధ్య పవర్ కట్, పాకిస్థాన్ విఫలం కావడంతో.. శ్రీలంక జట్టు బిల్ కట్టింది. వాళ్ల ఆర్థిక వైఫల్యాన్ని అంతర్జాతీయంగా లైవ్ టెలికాస్ట్ చేశారు.

పవర్ కట్ కారణంగా జయసూర్య తన సెంచరీని చేజార్చుకున్నాడు.

పాకిస్థాన్.. నిర్విరామంగా కరెంట్ కావాలంటే ముందు బిల్ కట్టండి.

కరాచీలో పవర్ కట్.. ఇది ఏమన్నా గల్లీ క్రికెట్టా??

సిటీ ఆఫ్ లైట్స్‌లో.. ‘లైట్స్’ అనే పదం సైలెంట్ ఏమో?

లైట్ పోయిందా?? ఏంటీ జోక్ చేస్తున్నారా??

శ్రీలంక ఓడిపోవాలని పాక్ బోర్డు కావాలనే ఈ కుట్ర చేసిందా??

ఇలా ఎవరికి తోచిన స్థాయిలో పాకిస్థాన్ బోర్డును వాళ్లు ఓ ఆటాడుకున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ఓపెనర్ బాబర్ ఆజాం సెంచరీతో 305 పరుగులు చేయగా.. ఈ లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. జయసూర్య(96), శనక(68) మినహా మిగితా వాళ్లు స్వల్పస్కోర్‌కే పరిమితం కావడంతో పాక్ ఈ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN