‘హజారే’కు వరుణుడి దెబ్బ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-25 06:40:33

బెంగళూరు: విజయ్‌ హజారే ట్రోఫీ తొలి రౌండ్‌ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డుపడడంతో.. ఆలూర్‌ (కర్ణాటక)లో మంగళవారం జరగాల్సిన ఎలైట్‌ గ్రూప్‌-ఎలో ఆంధ్రా-ఛత్తీ్‌సగడ్‌, హైదరాబాద్‌-కర్ణాటక, ముంబై-సౌరాష్ట్ర మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. అన్ని జట్లూ తలో రెండు పాయింట్లు పంచుకున్నాయి. బుధవారం ఇదే వేదికగా గోవాతో హైదరాబాద్‌ తలపడనుంది. రిటైర్మెంట్‌ను విరమించుకొని మళ్లీ బ్యాట్‌ పట్టిన కెప్టెన్‌ అంబటి రాయుడు హైదరాబాద్‌కు ప్రధాన ఆకర్షణ. దీంతోపాటు టోర్నీలో గత ఐదు మ్యాచ్‌ల్లో గోవాపై హైదరాబాద్‌దే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ జరిగితే రాయుడు సేనే ఫేవరెట్‌. వడోదరాలో జరగాల్సిన గ్రూప్‌-బి మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD