23వ స్వర్ణంతో ప్రపంచ రికార్డు సమం చేసిన బైల్స్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-13 04:40:54

img

స్టట్‌గార్డ్‌ : అమెరికా సంచలన జిమ్మాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ జిమ్మాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో చివరి రోజున ఆమె మరోక స్వర్ణం సాధించింది. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో బైల్స్‌ 17 స్వర్ణాలతో అదరగొట్టింది. మొత్తంగా ప్రపంచ జిమ్మాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో ఆమెకి ఇది 23వ స్వర్ణం. దీంతో పురుషుల జిమ్మాస్టిక్స్‌లో 23 బంగారు పతకాలతో విటలీ షెర్బో సాధించిన ఆల్‌టైమ్‌ రికార్డును బైల్స్‌ సమం చేసింది. చివరి రోజున బార్స్‌ ఫైనల్లో బైల్స్‌ పాల్గొంటుండంతో షెర్బో రికార్డును ఆమె అధిగమించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN