252 పరుగులకే ఆలౌటైన తమిళనాడు….

Amaravatinews

Amaravatinews

Author 2019-10-25 17:14:28

img

Share this on WhatsApp

బెంగళూరు:కర్ణాటక పేసర్‌ అభిమన్యు మిథున్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో ఇరగదీశాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో మిథున్‌ ఐదు వికెట్లతో చెలరేగి హ్యాట్రిక్‌ సాధించడంమే కాకుండా అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ ట్రోఫీలో హ్యాటిక్ర్‌ వికెట్లు సాధించిన తొలి కర్ణాటక బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మిథున్‌ అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది.

టాస్‌ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో అభినవ్‌ ముకుంద్‌- మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే మురళీ విజయ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరితే ముకుంద్‌(85) రాణించాడు. ఆ తర్వాత బాబా అపరాజిత్‌(66), విజయ్‌ శంకర్‌(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కర్ణాటక బౌలర్లు మిథున్‌ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్‌ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్‌ జైన్‌, కృష్ణప్ప గౌతమ్‌లకు తలో వికెట్‌ లభించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN