3 ఫార్మాట్లలోనూ టాప్‌-10లో రోహిత్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-24 06:16:49

img

దుబాయ్‌: భారత డాషింగ్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో టాప్‌-10లో చోటు సాధించిన మూడో భారత ఆటగాడిగా రికా ర్డు సృష్టించాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో సిరీ్‌సకు ముందు 44వ ర్యాంక్‌లో ఉన్న రోహిత్‌ ఇప్పుడు 34 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌లో నిలిచాడు. ప్రస్తుతం రోహిత్‌ వన్డేలో రెండో స్థానంలో, టీ20ల్లో ఏడో స్థానంలో ఉన్నాడు. గంభీర్‌, విరాట్‌ కోహ్లీ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ టాప్‌-10లో చోటు దక్కించుకున్న ఆటగాడు రోహితే. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన భారత టెస్టు వైస్‌ కెప్టెన్‌ రహానె కెరీర్‌ బెస్ట్‌ 5వ ర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా) టాప్‌లో కొనసాగుతుండగా.. విరాట్‌ 2వ, పుజారా 4వ స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో ఉండగా.. బుమ్రా 4వ, అశ్విన్‌ 10వ ర్యాంకుల్లో నిలిచారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN