3-0తో సిరీస్‌‌ టీమిండియా సొంతం

V6velugu

V6velugu

Author 2019-10-23 04:31:27

img

  • మూడో టెస్ట్‌‌లోనూ ఇన్నింగ్స్‌‌ 202 రన్స్‌‌ తేడాతో గెలుపు

రోహిత్‌‌ సూపర్‌‌హిట్‌‌.. బౌలర్లు బంపర్‌‌హిట్‌‌.. కింగ్‌‌ కోహ్లీ కెప్టెన్సీహిట్‌‌.. ఓవరాల్‌‌గా టీమిండియా మెగాహిట్‌‌..! వీటన్నింటికంటే.. తమ టెస్ట్‌‌ చరిత్రలో సౌతాఫ్రికాపై ఇండియా మెగా బంపర్‌‌హిట్‌‌ అయ్యింది..! ఈ సిరీస్‌‌లో బ్యాట్స్‌‌మెన్‌‌ హీరోలు.. బౌలర్లు సూపర్‌‌ హీరోలు.. సెంచరీ, డబుల్‌‌ సెంచరీలతో పరుగుల పండుగ చేసుకున్న చోట.. అంతే స్థాయిలో వికెట్ల జాతర కూడా కొనసాగించారు..! ఎన్నడూ లేని విధంగా.. గతాన్ని మైమరిపిస్తూ.. లెజెండరీ ప్లేయర్లు ప్రయత్నించినా సాధ్యంకాని ఓ రికార్డును.. విరాట్‌‌సేన అలవోకగా పట్టేసింది..! తడబాటు లేకుండా.. ఆధిపత్యం చేజారకుండా.. వ్యక్తిగత రికార్డులతో.. సౌతాఫ్రికాతో సిరీస్‌‌ను తొలిసారి 3–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేస్తూ నయా చరిత్రను సృష్టించింది..! మొత్తానికి స్వదేశంలో వరుసగా 11వ సిరీస్‌‌ విజయాన్ని అందుకున్న టీమిండియా.. సఫారీలపై అతి పెద్ద విక్టరీని సొంతం చేసుకుంది..!!

రాంచీ: అసలే సొంతగడ్డ.. ఆపై సూపర్‌‌ ఫామ్‌‌.. ఇంకేముంది… సౌతాఫ్రికాతో సిరీస్‌‌లో పెట్టుకున్న టార్గెట్‌‌ను టీమిండియా దిగ్విజయంగా ముగించింది. ప్రొటీస్‌‌తో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను వైట్‌‌వాష్‌‌ చేస్తూ.. 3–0తో సిరీస్‌‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డును సృష్టించింది. బౌలర్లు వీరోచితంగా చెలరేగడంతో నాలుగు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్ట్‌‌లోనూ ఇండియా ఇన్నింగ్స్‌‌ 202 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 132/8 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌లో 48 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది.

imgనాలుగో రోజు12 బంతుల్లోనే మిగిలిన రెండు వికెట్లు తీసిన టీమిండియా సఫారీలపై అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఓవర్‌‌ నైట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ డీబ్రూన్‌‌ (30), నోర్జ్‌‌ (5 నాటౌట్‌‌) డిఫెన్స్‌‌తో ముందుకెళ్లాలని ప్రయత్నించినా.. టీమిండియా స్పిన్‌‌ ముందు నిలువలేకపోయారు. తొలి ఓవర్‌‌ వేసిన షమీ (3/10) స్వింగ్‌‌ రాబట్టినా.. వికెట్‌‌ తీయలేకపోయాడు. కానీ రెండో ఓవర్‌‌ వేసిన నదీమ్‌‌ (2/18) రెండు సూపర్‌‌ టర్న్‌‌లతో సఫారీలకు చెక్‌‌ పెట్టాడు. లో లెంగ్త్‌‌తో వేసిన బంతిని ముందుకొచ్చి ఆడాలనుకున్న డీబ్రూన్‌‌.. షాట్‌‌ సెలెక్షన్‌‌ మార్చుకుని కట్‌‌ చేయబోయాడు. కానీ లో ఎడ్జ్‌‌ తీసుకున్న బాల్‌‌ నేరుగా కీపర్‌‌ సాహా చేతుల్లోకి వెళ్లింది. నదీమ్‌‌ తర్వాతి బంతిని టాస్‌‌గా సంధించడంతో.. కొత్తగా వచ్చిన ఎంగిడి (0) భారీ షాట్‌‌కు యత్నించాడు. బాల్‌‌ నేరుగా వెళ్లి నాన్‌‌ స్ట్రయిక్‌‌ ఎండ్‌‌లో ఉన్న నోర్జ్‌‌ ఎడమ మణికట్టును తాకి రీబౌండ్‌‌ అయ్యింది. తక్షణమే స్పందించిన నదీమ్‌‌ క్యాచ్‌‌ అందుకోవడంతో ప్రొటీస్‌‌ ఇన్నింగ్స్‌‌కు తెరపడింది. ఈ సిరీస్‌‌లో 529 రన్స్‌‌ చేసిన ‘హిట్‌‌మ్యాన్‌‌’ రోహిత్‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌; మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి. వరల్డ్​ చాంపియన్​షిప్​లో ప్రస్తుతం 240 పాయింట్లతో ఇండియా టాప్​లో కొనసాగుతున్నది.

స్కోర్ బోర్డ్:

ఇండియా తొలి ఇన్నింగ్స్‌ : 497/9 డిక్లేర్డ్‌‌‌‌సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 162 ఆలౌట్‌

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ (ఫాలో ఆన్‌‌‌‌): డికాక్‌ (బి) ఉమేశ్‌ 5, ఎల్గర్‌ ( రిటైర్డ్‌‌‌‌హర్ట్‌‌‌‌ )16, హమ్జా (బి) షమీ 0, డుప్లెసిస్‌ (ఎల్బీ) షమీ 4, బవుమా (సి) సాహా (బి) షమీ 0, క్లాసన్‌ (ఎల్బీ) ఉమేశ్‌ 5,లిండె (రనౌట్‌ ) 27, పీట్‌ (బి) జడేజా 23, డీబ్రూన్‌ (సి) సాహా (బి) నదీమ్‌ 30, రబడ (సి) జడేజా (బి) అశ్విన్‌ 12, నోర్జ్‌ (నాటౌట్‌ ) 5, ఎంగి డి (సి అండ్‌‌‌‌ బి) నదీమ్‌ 0, ఎక్స్‌ ట్రాలు: 6, మొత్తం: 48 ఓవర్లలో 133 ఆలౌట్‌ .

వికెట్లపతనం: 1–5, 2–10, 3–18,4–22, 5–36, 6–67, 7–98, 8–121, 9–133,10–133.

బౌలింగ్‌‌‌‌: షమీ 10–6–10–3, ఉమేశ్‌ 9–1–35–2, జడేజా 13–5–36–1, నదీమ్‌ 6–1–18–2, అశ్విన్‌ 10–3–28–1

img

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD