36 స్థానాలు మెరుగయ్యాడు

Nava Telangana

Nava Telangana

Author 2019-10-08 05:46:52

- టెస్టుల్లో రోహిత్‌ శర్మ నం.17
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌
దుబాయ్ : ఓపెనర్‌గా అరంగేట్ర టెస్టులోనే రెండు శతకాలు కొట్టి చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ టెస్టుల్లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. విశాఖ టెస్టులో దక్షిణాఫ్రికాపై రోహిత్‌ శర్మ వరుసగా 176, 127 పరుగుల ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. రోహిత్‌ మెరుపులతో విశాఖలో భారత్‌ 203 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు శతకాలతో రోహిత్‌ శర్మ 36 స్థానాలు ఎగబాకి నం.17 ర్యాంక్‌లో నిలిచాడు. విశాఖలో డబుల్‌ సెంచరీ బాదిన మయాంక్‌ అగర్వాల్‌ 38 స్థానాలు మెరుగై, నం.25 ర్యాంక్‌ సాధించాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండో స్థానం నిలుపుకున్నా.. 2018 జనవరి తర్వాత 900 పాయింట్ల దిగువకు తొలిసారి పడిపోయాడు. కోహ్లి రేటింగ్‌ పాయింట్లు ఇప్పుడు 899. సఫారీ బ్యాట్స్‌మన్‌ డీన్‌ ఎల్గార్‌ ఐదు స్థానాలు మెరుగై 14వ ర్యాంక్‌లో, డికాక్‌ నాలుగు స్థానాలు మెరుగై టాప్‌-10లో నిలిచాడు. 8 వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్‌ తిరిగి టాప్‌-10లోకి ప్రవేశించాడు. మహ్మద్‌ షమి కెరీర్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లు 710 సాధించి, నం.16 ర్యాంక్‌లో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లా క్రికెటర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ను వెనక్కి నెట్టిన రవీంద్ర జడేజా రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ నం.1గా కొనసాగుతోంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో 160 పాయింట్లతో టాప్‌ పొజిషన్‌ సాధించింది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD