40 ఏళ్ల తర్వాత స్టేడియాల్లోకి..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-10 06:36:07

img

  • ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు ఇరాన్‌ మహిళలు

టెహ్రాన్‌: మైదానంలో ప్రత్యక్షంగా సాకర్‌ మ్యాచ్‌లను చూసేందుకు నాలుగు దశాబ్దాల ఇరాన్‌ మహిళల నిరీక్షణకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. గురువారం ఇరాన్‌-కంబోడియా మధ్య 2022 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ అజాదీ స్టేడియంలో జరగనుంది. దీనికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ మ్యాచ్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన గంటలోనే అయిపోయాయని..కొనుగోలు చేసిన వారిలో స్త్రీలే అధికంగా ఉన్నారని ఫిఫా తెలిపింది. 1981 నుంచి ఇరాన్‌లో క్రీడా మైదానాల్లోకి స్త్రీలకు ప్రవేశం లేదు. ఈ విషయాన్ని ఫిఫా కొద్దికాలంగా ఆక్షేపిస్తోంది. మహిళల స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న నిబంధనలను సవరించకపోతే ఆ దేశ ఫుట్‌బాల్‌ గుర్తింపును రద్దు చేస్తామని ఇటీవల ఫిఫా గట్టిగా హెచ్చరించడంతో ఇరాన్‌ దారిలోకి వచ్చింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి చూడడానికి స్త్రీలను కూడా అనుమతిస్తున్నట్టు ఇరాన్‌ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD