6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా….

Amaravatinews

Amaravatinews

Author 2019-10-21 14:57:39

img

Share this on WhatsApp

రాంచీ:భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎదురీదుతున్నారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ జుబైర్ హంజా(62) మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ రాణించలేదు. మొదటి సెషన్ ముగిసే సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి, 129 పరుగులు చేసింది. జార్జ్ లిండే(10), డేన్ పైడ్ట్(4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేష్‌యాదవ్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టగా పేసర్ షమీ, అరంగేట్ర బౌలర్ నదీమ్ ఒక్కో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఇంకా 368 పరుగులు వెనకబడి ఉంది. మూడో రోజు తొలి సెషన్ లో భారత బౌలర్లు తమ తడాఖా చూపించారు. 4 వికెట్లు పడగొట్టి భారత్ ను తిరుగులేని స్థాయిలో నిలబెట్టారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN