72 గులాబీ బంతులు.. ఎస్జీకి బీసీసీఐ ఆర్డర్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-31 06:44:03

img

న్యూఢిల్లీ: భారత్‌ తొలిసారి డే/నైట్‌ టెస్ట్‌ ఆడుతున్న నేపథ్యంలో అందుకు అవసరమైన గులాబీ బంతులకు బీసీసీఐ ఆర్డరిచ్చింది. మొత్తం 72 గులాబీ బంతులను వచ్చేవారానికి సరఫరా చేయాలని ఎస్జీ కంపెనీకి బీసీసీఐ సూచించింది. భారత్‌లో మొదటిసారి జరుగుతున్న డే/నైట్‌ టెస్ట్‌కు బంతులను సిద్ధం చేయడం ఎస్జీకి సవాలే. గతంలో మూడు సీజన్లు దులీప్‌ ట్రోఫీని డే/నైట్‌లో నిర్వహించినా వాటికి కూకాబుర్రా బంతులను వాడారు. ‘ఆరు డజన్ల గులాబీ బంతులకు బీసీసీఐ ఆర్దరిచ్చింది. వాటిని వచ్చేవారానికి సరఫరా చేయనున్నాం. సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీ్‌సలో మా ఎర్ర బంతులు ఎంత నాణ్యంగా ఉన్నాయో అంతా చూశారు. గులాబీ బంతులనూ అంతే నాణ్యతతో తయారు చేస్తాం’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్వదేశంలో గత సీజన్‌లో ఎర్ర బంతుల నాణ్యత విషయంలో ఎస్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది. ఈ బంతులు త్వరగా నునుపు కోల్పోతున్నాయని కెప్టెన్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తంజేశాడు. కాగా కోల్‌కతా టెస్ట్‌కు అత్యుత్తమ నాణ్యత కలిగిన బంతులను అందిస్తామని ఎస్జీ ప్రతినిధి చెప్పారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD