72 పింక్ బంతులకు ఆర్డర్

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-31 03:00:13

img

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: చరిత్రాత్మక డే నైట్ టెస్టు కోసం 72 పింక్ బంతుల ను బీసీసీఐ ఆర్డర్ చేసింది. ఈ ఆర్డర్‌ను ప్రముఖ బంతుల తయారీదారు ఎస్జీ సంస్థకు అప్పగించింది. భారత్ ఈ నెల 22న కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్‌తో తొలి డే నైట్ మ్యాచ్‌ను ఆడనున్న విషయం తెలిసిందే. ఇరు జట్లకు ఇదే తొలి డే నైట్ మ్యాచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్య క్షుడు గంగూలీ మాట్లాడుతూ డే నైట్ మ్యాచ్ కోసం 72 పింక్ బంతులకు ఆర్డ ర్ చేశామని పేర్కొ న్నాడు. గతంలో ఎస్జీ బంతుల విషయంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ విముఖత చూపిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌తో ఇవే బంతులను వినియోగించడంతో కోహ్లీ సుముఖండా ఉన్నట్లు తెలుస్తోం ది. అయితే మొదటి టెస్టును ఎస్జీ సంస్థ తయారు చేసిన రెడ్ బంతితోనే ఆడతా మని, రెండో టెస్టు కూడా అదే కంపెనీకి చెందిన పింక్ బంతితో ఆడతామని స్ప ష్టం చేశాడు. మరోవైపు ఎస్జీ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్ మాట్లాడు డూ బీసీసీఐ 72 పింక్ బంతులను ఆర్డర్ చేసిందని, వాటిని వచ్చే వారం మధ్యలో మేం డెలివరీ చేస్తా మని చెప్పాడు. మీరు దక్షిణాఫ్రికా సిరీస్ లో చూసినట్టుగా మా ఎరుపు ఎస్జీ టెస్టు బంతిలో మేం గణనీయమైన మార్పులు చేశాం. పింక్ బాల్‌కు కూడా మాకు అదే స్థాయలో రీసెర్చ్ చేసే టీమ్ ఉందన్నాడు. అయితే ఇంగ్లాండ్, వెస్టిండీస్ దేశాల్లో డ్యూక్స్ బంతులను వినియోగిస్తుండగా, మిగతా దేశాలు కుకాబురాను వాడుతు న్నాయి.

*చిత్రం... బీసీసీఐ అధ్య క్షుడు గంగూలీ

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN