75 శాతం నిధులు మనవే.. బీసీసీఐ లేకుంటే ఐసీసీ మనుగడ లేదు!!

mykhel

mykhel

Author 2019-10-27 15:51:13

img

హిమాచల్ ప్రదేశ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్వహణకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) 75 శాతం నిధులు అందజేస్తోంది. బీసీసీఐ లేకుంటే ఐసీసీ మనుగడ లేదు అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ హమీర్‌పూర్‌లో శనివారం జరిగిన ఖేల్ మహాకుంభ్ టోర్నీ బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ఠాకూర్ పాల్గొని ఐసీసీపై మండిపడ్డారు.

అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... 'ఐసీసీ నిర్వహణకు బీసీసీఐ 75 శాతం నిధులు ఇస్తోంది. బీసీసీఐ లేకుంటే ఐసీసీ మనుగడ లేదు. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ నూతన పాలకవర్గం ఐసీసీ నుంచి బోర్డుకు రావాల్సిన బకాయిలను వసూలు చేస్తుందని ఆశిస్తున్నా. బీసీసీఐ కోశాధికారిగా నియమితుడైన నా సోదరుడు అరుణ్ ధుమాల్ నిజాయితీతో విధులు నిర్వహిస్తారని నమ్ముతున్నా. బోర్డు కోశాధికారిగా అరుణ్‌ను నియమించడం రాష్ట్రానికి గర్వకారణం. బోర్డు వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొననప్పటికీ.. కొన్ని విషయాలపై బీసీసీఐకి మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నా' అని అనురాగ్ చెప్పారు.

'క్రీడలు మనిషి వ్యక్తిత్వాలను రూపొందించడంలో సహాయపడతాయని మరియు ఒక వ్యక్తి సంపూర్ణ వృద్ధికి ఎంతో దోహదపడుతుతాయని నేను గట్టిగా నమ్ముతున్నా. ఆటగాళ్ల అట్టడుగు స్థాయి ప్రతిభను గుర్తించడం, సరైన దారి చూపించి ప్రోత్సహం అందించడమే ఖేల్ మహాకుంభ్ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఆటగాళ్ల ఎదుగుదలను నేను చూశా. కొందరు గొప్ప అథ్లెట్లుగా రూపాంతరం చెంది ముఖ్యమైన వేదికలలో ఆడుతున్నారు' అని అనురాగ్ అన్నారు.

బీసీసీఐకి దక్కాల్సిన వాటా ఇవ్వాల్సిందే అని ఐసీసీకి గంగూలీ ఓ సందేశాన్ని పంపాడు. ఐసీసీ నుంచి బీసీసీఐకి దక్కాల్సిన వాటాలో ఎంత రావాలో అంత రావాల్సిందేనని గంగూలీ పట్టుబడుతున్నాడు. ఓ మూడేళ్ళ క్రితం వరకు ప్రపంచ క్రికెట్‌లోని అన్ని బోర్డుల కంటే ఐసీసీ నుంచి బీసీసీఐ భారీ రెవెన్యూను తీసుకునేది. ఇక నూతన రెవెన్యూ పద్ధతి రావడంతో బీసీసీఐ ఆదాయంలో భారీగా కోత పడింది. 2016 నుంచి 2023 వరకు బీసీసీఐ 293 మిలియన్‌ డాలర్లు మాత్రమే అందుకోనుంది. ఇప్పుడు ఇదే అంశంపై గంగూలీ దృష్టి పెట్టబోతున్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN