IND vs BAN | ఉతికి ఆరేసిన రోహిత్ శర్మ ... బంగ్లాపై భారత్ విజయం

News18

News18

Author 2019-11-07 22:24:37

img

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిజృంభణతో భారతజట్టు 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చెలరేగి ఆడారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విజృంభించాడు. అతడు 43 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అందులో హ్యాట్రిక్ సిక్స్‌లు కూడా ఉండడం విశేషం. శిఖర్ ధావన్ 27 బాల్స్‌లో 31 రన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్, ఎస్ఎస్ అయ్యర్ మ్యాచ్‌ను విజయతీరాలకు తీసుకెళ్లారు. 15.4 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించారు.

టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. లీటన్ దాస్ (29), మొహమ్మద్ నయీమ్ (36), సౌమ్య సర్కార్ (30), మహమ్మదుల్లా (30) పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు. డీఎల్ చాహర్, కేకే అహ్మద్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. మొదటి టీ20 బంగ్లా గెలిచింది. రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD