IND vs BAN : నేడు మూడో టీ20... గెలిస్తే సిరీస్ మనదే

News18

News18

Author 2019-11-10 05:54:00

img

India vs Bangladesh 3rd T20 : ఇవాళ రాత్రి 7 కాగానే క్రికెట్ అభిమానులు అలర్ట్ అవ్వడం ఖాయం. ఎందుకంటే... అత్యంత కీలకమైన టీ20 మ్యాచ్ ఇవాళ నాగపూర్‌లో జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే... మూడు టీ20ల సిరీస్‌లో ఇటు టీమిండియా, అటు బంగ్లాదేశ్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఫలితంగా మూడో చివరి మ్యాచ్ కీలకం అయ్యింది. ఇందులో గెలిస్తే, భారత్ పరువు నిలబెట్టుకోవడమే కాదు... సిరీస్ దక్కించుకున్నట్లవుతుంది. అదే టీమిండియా దురదృష్టం కొద్దీ బంగ్లాదేశ్ గెలిస్తే... రోహిత్ సేనను అభిమానులు ఉతికారెయ్యడం ఖాయం. ఎందుకంటే... సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి జట్లతో పోల్చితే... బంగ్లాదేశ్ అంతంతమాత్రపు జట్టే. అలాంటిది ఆ జట్టే... మొదటి టీ20లో మనోళ్లకు షాక్ ఇచ్చింది. అందువల్ల బంగ్లాదేశ్‌ను పసికూన అనుకునే పరిస్థితిని మనవాళ్లు చేజార్చారు.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. అందులో టీమిండియా ఫేవరెట్‌గా బరిలో దిగాలంటే... ఇవాళ్టి మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. తద్వారా ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వరల్డ్ కప్ ఆడేందుకు గౌరవప్రదంగా ఉంటుంది. ఎక్స్‌పర్ట్ లెక్కల ప్రకారం... ప్రస్తుతం మన టీమ్ ఆల్ రౌండర్లతో రెడీగా ఉంది. కొన్ని ప్రయోగాలు చేస్తుంది. అయినప్పటికీ ఇవాళ్టి మ్యాచ్ సునాయాసంగా గెలిచేస్తుందని అంటున్నారు. మొదటి టీ20కి కూడా ఇలాగే అన్నారు. తీరా బరిలో దిగాక తెలిసింది మనోళ్ల సత్తా ఏంటో. అందువల్ల ఇవాళ్టి మ్యాచ్‌లో ఏమాత్రం తడబడినా... బంగ్లాదేశ్‌కి ఛాన్స్ ఇచ్చినట్లే అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.

Pics : అందాల రాశి... అమెరికా సింగర్ నాన్సీ క్యూట్ ఫొటోస్

ఇవి కూడా చదవండి :

అయోధ్య తీర్పు రాసిందెవరు?... తెలిస్తే షాక్ అవ్వరు

Health Tips : ధ్యానంలో ఏకాగ్రత పెరగాలా? ఈ తైలాలు వాడితే సరి...

Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు

Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు

Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN