IND vs SA : నేడు భారత్, సౌతాఫ్రికా మూడో టెస్టు... వైట్‌వాషే టార్గెట్

News18

News18

Author 2019-10-19 06:08:46

img

India vs South Africa 3rd Test : ఈ దీపావళిని విజయోత్సవాలతో జరుపుకునేందుకు టీమ్ ఇండియా రెడీ అయిపోతోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన... ముచ్చటగా మూడో టెస్టు కూడా గెలిచేసి... వైట్ వాష్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగా ఇవాళ జార్ఖండ్ రాజధాని రాంచీలో... మూడో టెస్ట్ ఉదయం 9-30 గంటలకు మొదలవ్వబోతోంది. ఈసారి స్పెషల్ ఏంటంటే... జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ... ఈ మ్యాచ్ చూసేందుకు వస్తున్నాడు. ముంబైలో ఉన్న ధోనీ... రాంచీ వచ్చి... ఈ ఒక్క రోజూ మ్యాచ్ చూస్తాడు. అందువల్ల అతని సూచనలు కూడా కుర్రాళ్లకు కలిసిరానున్నాయి. టీమిండియా లక్కేంటంటే... ప్రస్తుతం సఫారీల పరిస్థితి అస్సలు బాలేదు. భారత గడ్డపై వాళ్లు సరిగా ఆడలేక చతికిలపడుతున్నారు. అదే సమయంలో భారత జట్టు దుమ్ము రేపుతోంది. ఫలితమే మొదటి టెస్టులో 203 పరుగులు, రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 137 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. మరోవైపు పాయింట్ల బోర్డులో రెండో స్థానంలో ఉన్న కెప్టెన్ కోహ్లీ... ఈ టెస్టులో రాణిస్తే... ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ని వెనక్కి నెట్టి... మొదటి స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది.

రాంచీ స్టేడియంలో ఇది రెండో టెస్ట్ మ్యాచ్ మాత్రమే. ప్రస్తుతం పిచ్ పొడిగా ఉండటం వల్ల స్పిన్, రివర్స్ స్వింగ్‌కి ఛాన్స్ ఉందంటున్నారు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ప్రస్తుతం ఆకాశంలో కొన్ని మేఘాలున్నా... వర్షం పడేంత సీన్ మాత్రం లేదు.

టీమిండియా పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, మయాంక్ అగర్వాల్‌తో పాటు చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో బ్యాటింగ్‌లో దుమ్ము రేపుతుండగా... బౌలింగ్‌లో మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ వికెట్లు పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

భారత్‌ (అంచనా):మయాంక్‌, రోహిత్‌, పుజారా, కోహ్లీ, రహానె, జడేజా, సాహా, అశ్విన్‌, ఇషాంత్‌, ఉమేష్‌/నదీమ్‌, షమి.

దక్షిణాఫ్రికా (అంచనా) : ఎల్గర్‌, హమ్‌జా, డి బ్రుయిన్‌, డుప్లెసి, బవుమా, డికాక్‌, ముత్తుస్వామి, ఫిలాండర్‌, నోర్టే/ఎన్‌గిడి, పీట్‌, రబాడ.

Pics : పింక్ డ్రెస్‌లో ఫిదా చేస్తున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్

ఇవి కూడా చదవండి :

నేడు తెలంగాణ బంద్... క్యాబ్ సర్వీసులూ బంద్... చర్చలు లేవ్...

Health Tips : శరీరానికి సరిపడా ఐరన్ తీసుకుంటున్నారా... ఇలా చెయ్యండి

Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD