IND vs SA: మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ.. ఇండియా స్కోరు ఎంతంటే..

News18

News18

Author 2019-10-03 14:23:29

img

విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పటిష్ట స్థితికి చేరింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ 317 పరుగులు జోడించగా.. డబుల్ సెంచరీ చేసే తరుణంలో రోహిత్ శర్మ 176 పరుగుల వద్ద మహారాజ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పుజారా 6 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కేవలం 20 పరుగులే చేసి ముత్తుస్వామి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రహానే కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరోవైపు, మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టేశాడు. 358 బంతుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అందులో 22 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం మయాంక్ 210 పరుగుల వద్ద క్రీజులో కొనసాగుతున్నాడు.

ఇప్పటికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 431 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ రెండు, ఫిలాండర్, ముత్తుస్వామి చెరో వికెట్ దక్కించుకున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN