IND vs SA: రోహిత్ శర్మ సెంచరీ.. సిక్సుల మీద సిక్సులు బాదుతూ..

News18

News18

Author 2019-10-02 14:54:28

img

టెస్టుల్లో మిడిల్ ఆర్డర్‌లో ఘోరంగా విఫలమైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా దుమ్ముదులిపేస్తున్నాడు. విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తున్నాడు. ఇన్నింగ్స్ 53వ ఓవర్లో సింగిల్ తీసి వంద పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 60కి పైగా సగటుతో రాణించాడు. ప్రస్తుతం 174 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అందులో 5 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. 183 బంతుల్లో 84 పరుగులు(2 సిక్సులు, 11 ఫోర్లు) చేసి, రోహిత్‌కు చక్కటి భాగస్వామ్యం అందిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో పంత్‌కు బదులు సాహాకు అవకాశం ఇచ్చాడు. నిన్ననే మీడియా సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు, అశ్విన్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో పుజారా, రహానే, విహారి, సాహా, జడేజా, ఇషాంత్ శర్మ, షమీ కూడా ఆడుతున్నారు. ఇదిలా ఉండగా, 59వ ఓవర్ల వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇంకా ఈ రోజు కోటా 30 ఓవర్లు మిగిలే ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్ స్కోరు 59.1 ఓవర్లకు 202/0గా ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN