IND vs SA : విశాఖ టెస్టులో టీమిండియా ఘన విజయం

News18

News18

Author 2019-10-06 14:18:23

img

India vs South Africa 1st Test : విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై 203 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. చివరి రోజున రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించడంతో... సఫారీల ఆట సాగలేదు. ఆట నాలుగో రోజున 414 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆది నుంచీ వికెట్ల గండం వెంటాడింది. చివరి రోజు... 384 పరుగులు చెయ్యాల్సి ఉండగా... 9 వికెట్లు పడగొట్టి విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్న టీమిండియా... అనుకున్నట్లుగానే పక్కా వ్యూహాలు అమలుచేసింది. ఫలితంగా 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా చేతులెత్తేసింది. టెయిలెండర్లు శ్రమించినా... 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో కోహ్లీ టీం ప్రత్యర్థిని చిత్తుచేసి... తొలి టెస్టును కైవసం చేసుకుంది. 87 పరుగలకు 4 వికెట్లు పడగొట్టి... రవీంద్ర జడేజా... 35 పరుగులకే 5 వికెట్లు తీసి మహ్మద్ షమి... టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీసుకున్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN