India vs South Africa: పుణె టెస్టులో విరాట్ కొహ్లీ డబుల్ సెంచరీ

News18

News18

Author 2019-10-11 15:05:21

img

India vs South Africa: పుణె టెస్టులో కెప్టెన్ విరాట్ కొహ్లీ దూకుడు కొనసాగుతోంది. టీ బ్రేక్ తర్వాత డబుల్ సెంచరీ చేసి సత్తా చాటిన కొహ్లీ... కెరీర్‌లో ఏడో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. వీటిలో ఆరు డబుల్ సెంచరీలు భారత్‌‌లోనే సాధించడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో 7వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు కొహ్లీ. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 500 పరుగుల మార్కును అందుకుంది. క్రీజులో కొహ్లీ, జడేజా నిలకడగా ఆడుతున్నారు.

కొహ్లీ డబుల్ సెంచరీలు

జట్టుసంవత్సరంవేదికపరుగులు
శ్రీలంక2017ఢిల్లీ243
ఇంగ్లండ్2016ముంబై235
శ్రీలంక2017నాగపూర్213
న్యూజిలాండ్2016ఇండోర్211
బంగ్లాదేశ్2016హైదరాబాద్204
వెస్టిండీస్2016నార్త్ సౌండ్200
సౌతాఫ్రికా2019పుణె200 *

ఇక అత్యధిక టెస్ట్ డబుల్ సెంచరీలు చేసిన వారిలో కొహ్లీ (7) నాలుగో స్థానంలో ఉన్నాడు. 12 డబుల్ సెంచరీలతో డాన్ బ్రాడ్‌మన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక 11 డబుల్ సెంచరీలతో సంగక్కర రెండో స్థానం, 9 డబుల్ సెంచరీలతో బ్రియలాన్ లారా మూడో స్థానంలో ఉన్నారు. కొహ్లీతో పాటు వ్యాలీ హ్యామండ్, జయవర్దనే 7 డబుల్ సెంచరీలు చేశారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN