MS Dhoni: ధోని రిటైర్మెంట్పై యువీ సంచలన వ్యాఖ్యలు..
ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు రిటైర్ అవుతారని జోరుగా చర్చ నడుస్తోంది. వరల్డ్ కప్ తర్వాత ధోని తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ధోని కాస్త విశ్రాంతి కోరుకున్నాడు. ఆర్మీ సేవలో తరించేందుకు కాశ్మీర్ వెళ్లి విధుల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత వచ్చినా నవంబరు వరకు సెలెక్టర్లకు అందుబాటులో ఉండటం లేదని తానే స్వయంగా ప్రకటించాడు. అయితే, ఇప్పటికీ ధోని రిటైర్మెంట్పై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. టీమిండియా మాజీలు కొందరు అతడు ఇక వీడ్కోలు చెబితే బెటర్ అని, ఇంకా సాగదీస్తే ఘనమైన వీడ్కోలు కోల్పోతారని అంటున్నారు. అయితే, ధోని దోస్త్, సిక్సర్ల వీరుడు, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మిస్టర్ కూల్ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ధోని, యువరాజ్ సింగ్ (ఫైల్)

— - టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్
ఎప్పుడు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలన్న దానిపై అతడే నిర్ణయించుకోవాలని, ఇంకా ఆడాలని ధోని కోరుకుంటే అతడి నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలని చెప్పాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటించాక.. అతడి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక, ధోనితో రిషబ్ పంత్‌ను పోల్చడం సరికాదని యువీ అన్నాడు. ధోని ఒక్క రోజులో అద్భుత క్రికెటర్‌గా మారలేదని, ఆ స్థాయికి దగ్గరగా చేరాలంటే పంత్‌కు చాలా ఏళ్లు పడుతుందని వెల్లడించాడు.