రికార్డు తిరగరాసిన బైల్స్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-08 03:36:11

img

* ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌
స్టుట్‌గార్ట్‌ (జర్మనీ): అమెరికన్‌ జిమ్నాస్టిక్స్‌ సంచలనం సిమోన్‌ బైల్స్‌ మరోసారి అద్భుత ప్రదర్శనతో నయా చరిత్ర సృష్టించింది. ఫ్లోర్‌ ఈవెంట్‌లో ట్రిపుల్‌-డబుల్‌ చేసి ఈ రికార్డును బేల్స్‌ నెలకొల్పింది. ఐదుసార్లు ఒలింపిక్‌ విజేత, 14సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన బైల్స్‌ సోమవారం వరల్డ్‌ ఆర్టిస్టిక్‌ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ మొదటి రోజే చూపరులను ఆకట్టుకుంది. గంటల వ్యవధిలో రెండు విన్యాసాలను తన పేరిట లిఖించుకుంది. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ క్వాలిఫికేషన్‌లో బైల్స్‌.. ట్రిపుల్‌-డబుల్‌ స్కిల్‌ను ప్రదర్శించింది. ఆమె ప్రదర్శన ఎలా సాగిందంటే... గాలిలోకి ఎగిరి కిందకు ల్యాండ్‌ అయ్యే క్రమంలో శరీరాన్ని రెండుసార్లు బ్యాక్‌ ఫ్లిప్‌ చేస్తూ మూడుసార్లు ట్విస్ట్‌ చేయడం. అత్యంత అరుదైన, సాహసోపేతమైన ఈ అద్భుత విన్యాసాన్ని 22 ఏళ్ల బైల్స్‌ ఆవిష్కృతం చేసి చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ అరుదైన విన్యాసాలను మరోసారి ప్రదర్శించి దానికి తన పేరునే లిఖించుకున్న బైల్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది. దీనికి 'బైల్స్‌-2'అని పేరు పెట్టారు. ఆపై, బీమ్‌లో డబుల్‌-ట్విస్టింగ్‌ డబుల్‌ టక్‌ డిస్మౌంట్‌ను ప్రదర్శననూ చేసింది బైల్స్‌. జిమ్నాస్టిక్స్‌లో మొట్టమొదటగా చేసిన ఈ విన్యాసాన్ని ఇకపై 'బైల్స్‌'అని పిలవనున్నారు. ఇటీవల జరిగిన యుఎస్‌ జిమ్నాస్ట్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఫ్లోర్‌ రొటీన్‌ ఈవెంట్‌లో అత్యంత క్లిష్టమైన ట్రిపుల్‌-డబుల్‌ విన్యాసం చేసిన బైల్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD