Pune Testలో భారత్ గెలుపు.. సిరీస్ 2-0తో కైవసం

NewsDaily

NewsDaily

Author 2019-10-13 17:47:03

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ని ఒక టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ జట్టు 2-0తో చేజిక్కించుకుంది. వైజాగ్ టెస్టులో ఆఖరి రోజు ఫలితం తేలగా.. పుణె టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియడం విశేషం.

imgThird party image reference

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం ఫాలోఆన్ ఆడిన సఫారీలు మూడో సెషన్ ఆరంభంలోనే 189 పరుగులకి ఆలౌటయ్యారు.

గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 601/5తో డిక్లేర్ చేయగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 275 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. ఈరోజు సఫారీలను ఫాలోఆన్ ఆడించి.. వారిని 189 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN