Ranchi Testకి భారత్ తుది జట్టులో ఒక మార్పు...

NewsDaily

NewsDaily

Author 2019-10-15 13:10:31

రాంచీ పిచ్ స్పిన్నర్లకి మరీ ముఖ్యంగా ఎడమచేతి వాటం స్పిన్నర్లకి ఎక్కువగా కలిసిరానుంది. దీంతో.. జడేజాతో పాటు మరో స్పిన్నర్‌ని తుది జట్టులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

imgThird party image reference

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌‌ని ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకున్న భారత్ జట్టు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. రాంచీ వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. తుది జట్టులో ఒక మార్పు చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2017లో ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏకంగా 9 వికెట్లు పడగొట్టిన నేపథ్యంలో.. ఈ సారి జడేజాతో పాటు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌‌ని కూడా ఆడించాలని భారత్ ఆలోచిస్తోంది.

పుణె టెస్టుల్లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో భారత్ జట్టు బరిలోకి దిగింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా జట్టుని రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆలౌట్ చేయగలిగింది. అయితే.. పుణె టెస్టులో సఫారీ టెయిలెండర్లని వేగంగా పెవిలియన్‌కి పంపడంలో మాత్రం టీమిండియా బౌలర్లు కాస్త తడబడ్డారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒకే ఒక వికెట్ పడగొట్టగలిగాడు. దీంతో.. రాంచీ టెస్టులో అతనిపై వేటు వేసి ఎడమచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌కి అవకాశమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కి అనుకూలించే రాంచీ పిచ్‌.. మూడో రోజు నుంచి స్పిన్నర్లకి కలిసిరానుందని రికార్డులు చెప్తున్నాయి. అదీ.. ఎడమచేతి వాటం స్పిన్నర్లకి స్వర్గధామం. భారత్‌తో 2017లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా లెప్ట్ హ్యాండ్ స్పిన్నర్ స్టీవ్‌ ఒకీఫ్ కూడా ఒకే ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. రాంచీ‌లో ఇషాంత్‌కి మెరుగైన రికార్డ్‌ కూడా లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ టెస్టులో ఇషాంత్ శర్మ.. 31 ఓవర్లు వేసి తీసింది ఒక్క వికెట్ మాత్రమే. దీంతో.. తుది జట్టులో మార్పు ఖాయంగా కనిపిస్తోంది

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN