Rohit Sharma: రోహిత్ శర్మపై నెటిజన్లు ఫైర్...ఎందుకో తెలుసా..?

News18

News18

Author 2019-10-28 22:00:26

img

దీపావళి సందర్భంగా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన ట్విట్టర్‌ అకౌంట్ లో చేసిన ట్వీట్ ఒక వివాదాస్పదంగా మారింది. అందులో రోహిత్ ఇలా ట్వీట్ చేశాడు...నా తోటి భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనకు మరింత కాంతిని ఇస్తుందని, ఆశిస్తున్నా. టపాసులను పేల్చే ముందు వీటిని గుర్తుంచుకోండి. భయంతో వాటిని చూడటం భయంకరంగా ఉంది. అంటూ టపాసులు పేల్చడంతో వచ్చిన శబ్ధానికి వీధి కుక్కలు భయపడుతున్న వీడియోని పోస్టు చేశాడు. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ ట్వీట్‌కు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కేవలం దీపావళి సమయంలో మీ అందరికీ కాలుష్యం సంగతి గుర్తొస్తుందా అంటూ నెటిజన్లు విమర్శించారు. అంతేకాదు ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పుడు మీ జట్టు సభ్యులు అంతా కలిసి బాణా సంచా పేల్చారని నెటిజన్లు గుర్తు చేశారు. అంతేకాదు ఐపీఎల్ లాంటి ఈవెంట్లలో కూడా అనవసరంగా బాణాసంచా కాలుస్తారని, అందుకే ఆ టోర్నీని బాయ్ కాట్ చేస్తే మంచిదని నెటిజన్లు సలహాలు ఇచ్చారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN