Team Indiaలో ఆరేళ్ల తర్వాత మరో సెహ్వాగ్

NewsDaily

NewsDaily

Author 2019-10-07 12:39:43

సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ.. టీ20 తరహా హిట్టింగ్‌తో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదేశాడు. దీంతో.. సెహ్వాగ్ తరహా ఓపెనర్‌‌ని టీమిండియా పట్టుకోగలిగిందని కోహ్లీ చిన్ననాటి కోచ్ అభిప్రాయడ్డాడు.

imgThird party image reference

టీమిండియా మేనేజ్‌మెంట్ ఎట్టకేలకి ఆరేళ్ల తర్వాత మరో వీరేంద్ర సెహ్వాగ్‌ని వెతికి పట్టుకోగలిగిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో వైజాగ్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో.. మొదటి సారి టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ (176, 127) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో జట్టుకి మెరుగైన స్కోరు కోసం కాస్త ఆచితూచి ఆడినట్లు కనిపించిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం టీ20 తరహా హిట్టింగ్‌తో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో స్పిన్నర్ డేన్ పీట్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ హ్యాట్రిక్ సిక్సర్లు కూడా నమోదు చేయడం విశేషం. వెస్టిండీస్‌ టూర్‌లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై వేటు వేసి అతని స్థానంలో రోహిత్‌కి సెలక్టర్లు అవకాశమిచ్చిన విషయం తెలిసిందే.

‘రోహిత్ శర్మ చాలా అద్భుతమైన ఆటగాడు. తన సామర్థ్యం ఏంటో..? ఇప్పటికే వన్డేల్లో అతను నిరూపించుకున్నాడు. కానీ.. తాజాగా వైజాగ్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదడం ద్వారా టెస్టుల్లోనూ తాను ఓ గొప్ప ఆటగాడినని రోహిత్ శర్మ చాటిచెప్పాడు. భారత్ జట్టుకి ఇప్పుడు స్థిరమైన ఓపెనర్‌ దొరికాడు. జట్టు అవసరాలకి తగినట్లు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయగలడు. ఎట్టకేలకి టీమిండియా మేనేజ్‌మెంట్ మరో సెహ్వాగ్‌ని వెతికి పట్టుకోగలిగింది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు సాధించడం ద్వారా టెస్టు జట్టులోకి రోహిత్ శర్మ రాగలిగాడు’ అని రాజ్‌కుమార్ శర్మ వెల్లడించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 2013లో చివరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD